అత్యవసరం అయితే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దు

ABN , First Publish Date - 2020-07-13T22:22:44+05:30 IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

అత్యవసరం అయితే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వచ్చిన వారు కూడా ఎలాంటి భయాందోళనకు గురికావద్దన్నారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. సోమవారం ఆయన  కరోనా అప్రమత్తతపై మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పై దృష్టిపెట్టాలని అన్నారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలన్నారు. నియోజక వర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన సీనియర్‌ సిటీజన్స్‌ వారి ప్రాంతాల్లో శానిటైజేషన్‌ చేయించాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి తలసాని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. సనత్‌ నగర్‌ నియోజక వర్గంలోని సనత్‌నగర్‌లో ఇండస్ర్టియల్‌పార్క్‌ వద్ద కరోనా స్ర్కీనింగ్‌ టెస్ట్‌ శిబిరాన్ని ఏర్పాటుచేశామని మంత్రి తెలిపారు. దానిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. వైద్య సేవల విషయంలో కూగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని అన్నారు. 


Updated Date - 2020-07-13T22:22:44+05:30 IST