గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ బలోపేతం కావాలి

ABN , First Publish Date - 2020-07-12T01:12:49+05:30 IST

గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద బలోపేతం కావాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌అన్నారు.

గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ బలోపేతం కావాలి

రంగారెడ్డిజిల్లా: గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద బలోపేతం కావాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌అన్నారు. కుల వృత్తులపై ఆధారపడ్డ వారి కుటుంబాలు ఆర్ధికంగా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌నియోజక వర్గం పరిధిలోని ఫరూఖ్‌ నగర్‌ మండలం కంసాని పల్లి గ్రామ పరిధిలో ఉన్న పశువీర్యోత్పత్తి కేంద్రాన్ని మంత్రి తలసాని సందర్శించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పశువులకు ఉపయోగించే అత్యాధునిక లేబోరేటరీని ఏర్పాటుచేస్తామన్నారు. గాలికుంటు వ్యాధులు రాకుండా పశువులకు సరియైున సమయంలో నట్టల నివారణకు మందులను వేయాలని పేర్కొన్నారు.


పశువులకు గర్భధారణ సమయంలో సరైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా పశువీర్యోత్పత్తి కేంద్రం ఆవరణలో మొక్కలను నాటారు. నాటిన మొక్కలను పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వనం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-12T01:12:49+05:30 IST