ఈ నెల 7న టీఆర్ఎస్ గ్రేటర్ జనరల్ బాడీ సమావేశం

ABN , First Publish Date - 2021-09-05T21:05:13+05:30 IST

ఈ నెల 7వ తేదీన హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల స్థాయి టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.జలవిహార్ లో ఈ సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆదివారం జలవిహార్ లో పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహణ

ఈ నెల 7న టీఆర్ఎస్ గ్రేటర్ జనరల్ బాడీ సమావేశం

హైదరాబాద్: ఈ నెల 7వ తేదీన హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల స్థాయి టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.జలవిహార్ లో ఈ సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆదివారం జలవిహార్ లో పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 7 వ తేదీన ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిధిగా హాజరవుతారని చెప్పారు.


అంతేకాకుండా నగర పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యే లు, వివిధ కార్పోరేషన్ ల చైర్మన్ లు, కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, పార్టీ ముఖ్య నాయకులు, డివిజన్ అద్యక్షులు తదితరులు పాల్గొంటారని వివరించారు. ఈ సమావేశంలో పార్టీని బలోపేతం చేసేందుకు త్వరలో చేపట్టనున్న బూత్, డివిజన్, నగర కమిటీ ల నియామకం పై దిశానిర్దేశం చేయడం జరుగుతుందని, పార్టీని ఆధ్వర్యంలో భవిష్యత్ లో చేపట్టనున్న కార్యక్రమాల గురించి సమీక్షించడం జరుగుతుందని చెప్పారు.


60 లక్షల సభ్యత్వాలతో దేశంలోనే టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీ గా గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో అన్యాయానికి గురవుతున్న నేపధ్యంలో స్వయం పాలన తోనే మన ప్రాంత అభివృద్ధి సాధ్యమని, అది తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందని భావించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో 2001 సంవత్సరంలో లో ఏర్పడినదే టీఆర్ఎస్ పార్టీ అని వివరించారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నాటి ఉద్యమనాయకుడు నేటి ముఖ్యమంత్రి గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గడిచిన 7 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని చెప్పారు. 

Updated Date - 2021-09-05T21:05:13+05:30 IST