Abn logo
Apr 8 2021 @ 15:06PM

కాంగ్రెస్ హయాంలో వారు ఏం చేశారో చెప్పాలి: తలసాని

నాగార్జున సాగర్: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను మేము చెప్పుతున్నాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారు ఏం చేశారో ఆపార్టీ నాయకులు చెప్పాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మాడుగులపల్లి మండలం ధర్మాపురం గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి తలసాని మాట్లాడుతూ జానారెడ్డి 14 సంవత్సరాలు మంత్రిగా ఈ నియోజకవర్గం కు ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. నియోజకవర్గ ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే ఎంతో అభివృద్ధి చేశామని కాంగ్రెస్ నేతలు చెప్పడం సిగ్గుచేటు. ఏ గ్రామానికి సరైన రహదారి లేదు. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటూ తలసాని ప్రశ్నించారు.


కాంగ్రెస్ నేతలకు పదవుల మీద ఉన్న ప్రేమ ప్రజా సమస్యలపై ఉండదు. అధికారంలో ఉన్నప్పుడే చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే ఏమిటో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్  ప్రభుత్వం చేసి చూపెట్టింది. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు.ప్రజలు టీఆర్ఎస్ కు స్వచ్చందంగా మద్దతు తెలుపుతున్నారు.నోముల భగత్ 40 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం  సాధించడం ఖాయమని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement