నేడు సర్కార్‌ ఇఫ్తార్‌ విందు.. హాజరుకానున్న CM KCR

ABN , First Publish Date - 2022-04-29T11:49:08+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో శుక్రవారం ముస్లింలకు

నేడు సర్కార్‌ ఇఫ్తార్‌ విందు.. హాజరుకానున్న CM KCR

  • అన్ని ఏర్పాట్లు పూర్తి : మంత్రులు


హైదరాబాద్ సిటీ/బర్కత్‌పుర : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో శుక్రవారం ముస్లింలకు ఇఫ్తార్‌ విందును ఇవ్వనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర మంత్రులు మహమూద్‌ ఆలీ, తలసాని శ్రీనివా ్‌సయాదవ్‌ తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించే ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరవుతారని తెలిపారు. ఇఫ్తార్‌ విందుకు ప్రత్యేక పాసులున్న వారినే అనుమతి ఇస్తారని తెలిపారు. వారి వెంట మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్‌, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అహ్మద్‌ నదీమ్‌, డైరెక్టర్‌ షాహనవాజ్‌ ఖాసీం, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే‌ష్‌కుమార్‌, ఐజీ రంగనాథ్‌, జాయింట్‌ సీపీ డి.ఎస్‌.చౌహన్‌, రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు కిషోర్‌గౌడ్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పాల్గొన్నారు.


హైదరాబాద్‌ సిటీ : ఎల్‌.బీ. స్టేడియంలో ఇఫ్తార్‌ విందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టేడియాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ఇతర వాహనాలకు అనుమతి లేదని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. రంజాన్‌ మాసంలో చివరి శుక్రవారం (జుమాతుల్‌ విదా) ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్‌, మక్కామసీదు వద్ద, సికింద్రాబాద్‌ జామా మసీద్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసులు వెల్లడించారు. 

Updated Date - 2022-04-29T11:49:08+05:30 IST