కడప ఘటనపై మంత్రి ఆదిమూలపు దిగ్ర్భాంతి

ABN , First Publish Date - 2021-05-08T20:23:28+05:30 IST

కడప జిల్లాలోని మామిళ్లపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే.

కడప ఘటనపై మంత్రి ఆదిమూలపు దిగ్ర్భాంతి

అమరావతి: కడప జిల్లాలోని మామిళ్లపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు.  


కడప : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలసపాడు మండలంలో మామిళ్లపల్లె గ్రామ శివారులో ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించింది. ముగ్గు రాళ్ల గనిలో ఉన్న 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ముగ్గురాళ్లను తొలగించడానికి పేలుడు పదార్థాలను వినియోగించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Updated Date - 2021-05-08T20:23:28+05:30 IST