రెఫరెన్స్‌ వేరు.. రికమండేషన్‌ వేరు!

ABN , First Publish Date - 2020-04-10T07:25:53+05:30 IST

ఏపీలోని 14 యూనివర్సిటీల పాలక మండళ్లకు 63 మందిని రెఫరెన్స్‌ల (రాజకీయ సిఫారసులు) ఆధారంగా నియమించామని విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌...

రెఫరెన్స్‌ వేరు.. రికమండేషన్‌ వేరు!

  • పొలిటికల్‌ ‘పాలకమండళ్ల’పై మంత్రి సురేశ్‌ వివరణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని 14 యూనివర్సిటీల పాలక మండళ్లకు 63 మందిని రెఫరెన్స్‌ల (రాజకీయ సిఫారసులు) ఆధారంగా నియమించామని విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పేర్కొన్నారు. ఎలాంటి రెఫరెన్స్‌లు లేకుండా 53 మందిని నియమించామన్నారు. నియామకాల్లో ప్రతిభకే ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించారు.  విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను ఫక్తు రాజకీయ తరహాలో నింపడం... ‘ఫలానా నేత సిఫారసు మేరకు నియమిస్తున్నాం’ అంటూ నేరుగా నోట్‌ఫైల్‌లోనే రాసిన వైనం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిపై గురువారం హైదరాబాద్‌ లేక్‌వ్యూ గెస్ట్‌హౌ్‌సలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. రెఫరెన్‌ ్సకు, రికమండేషన్‌కు చాలా తేడా ఉందంటూ సమర్థించుకున్నారు.


Updated Date - 2020-04-10T07:25:53+05:30 IST