Minister: 100 రోజుల్లో 5 కోట్ల ఆరోగ్య కార్డుల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-29T16:14:39+05:30 IST

ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్య కర్ణాటక పథకాల ద్వారా రానున్న 100 రోజుల్లో రాష్ట్రంలోని 5 కోట్ల మందికి ఆరోగ్య కార్డులను పంపిణీ చేయాలని

Minister: 100 రోజుల్లో 5 కోట్ల ఆరోగ్య కార్డుల పంపిణీ

                                    - ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌


బెంగళూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్య కర్ణాటక పథకాల ద్వారా రానున్న 100 రోజుల్లో రాష్ట్రంలోని 5 కోట్ల మందికి ఆరోగ్య కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌(Health Minister Dr K Sudhakar) బుధవారం మైసూరు వైద్యకళాశాల, పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య ప్రదర్శన ప్రారంభోత్సవ సభలో ప్రకటించారు. ఇప్పటికే 15 రోజుల్లోనే 85 లక్షల ఆరోగ్యకార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తయిందన్నారు. రాజధాని బెంగళూరు నగరంతో పాటు అన్ని జిల్లాల్లోనూ కార్డుల పంపిణీ ప్రక్రియ శరవేగంగా సాగుతోందన్నారు. ఒకసారి కార్డు పొందిన వారు మూడేళ్ల అవధి వరకు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య చికిత్స సదుపాయాలను పొందవచ్చునన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ చికిత్సను అందుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్యుల కొరత లేదని కొవిడ్‌ అనంతరం ఉత్తమ వైద్యసదుపాయాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. 


Updated Date - 2022-09-29T16:14:39+05:30 IST