వైద్యానికి పెద్దపీట : మంత్రి సుచరిత

ABN , First Publish Date - 2020-02-20T07:59:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట వేయడం జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రత్తిపాడు గ్రామ సచివాలయం-2లో కంటివెలుగు కార్యక్రమాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు.

వైద్యానికి పెద్దపీట : మంత్రి సుచరిత

ప్రత్తిపాడు, ఫిబ్రవరి 19 : రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట వేయడం జరిగిందని రాష్ట్ర హోం  శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రత్తిపాడు గ్రామ సచివాలయం-2లో కంటివెలుగు కార్యక్రమాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించే విధానాన్ని పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కళ్లు ఉంటేనే మనం ఏదైనా చేయగలమన్నారు. ఇక నుంచి వృద్ధులు ఎవరూ డబ్బులు లేవని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. కంటికి సంబంధించిన ఎలాంటి శస్త్ర చికిత్సలు అయినా, కళ్ల జోళ్లు అయినా ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు.  డీఎంహెచ్‌వో జొన్నలగడ్డ యాస్మిన్‌ మాట్లాడుతూ జిల్లాలో కంటి వెలుగు కోసం ప్రత్యేకంగా టీం పనిచేయడం జరుగుతుందని, ఒక్కో మండలం చెక్‌ చేసుకుంటూ వెలుతుందని, ఇది సంవత్సరన్నర పాటు నిరంతరం జరిగే ప్రక్రియ అన్నారు. ప్రభుత్వ వైద్యశాలతో పాటు జిల్లాలో శంకర కంటి ఆసుపత్రి, కాటూరి వైద్యశాలలో శస్త్ర చికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంఽద్రం వైద్యులు డాక్టర్‌ కిరణ్‌, కంటి వెలుగు నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌, తహసీల్దార్‌ పూర్ణచంద్రరావు, ఎంపీడీవో టీవీ విజయలక్ష్మి, మండల కన్వినర్‌ గట్టు విజయ్‌, గంగిరెడ్డి చెన్నారెడ్డి, బాపతు శ్రీనివాసరెడ్డి, బాపతు వెంకటేశ్వరరెడ్డి, గంగిరెడ్డి పరమారెడ్డి, గుజ్జుల శివారెడ్డి, ఉడుతూరి ఓం ప్రకాష్‌రెడ్డి, వేలూరి లక్ష్మారెడ్డి, ఉద్దగిరి మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T07:59:50+05:30 IST