రాష్ట్రంలో ‘బీఏ4, బీఏ5’ రకం Covid వైరస్‌ వ్యాప్తి తీవ్రం: మంత్రి

ABN , First Publish Date - 2022-07-02T18:16:04+05:30 IST

రాష్ట్రంలో ‘బీఏ4, బీఏ5’ రకం Covid వైరస్‌ వ్యాప్తి తీవ్రం: మంత్రి

రాష్ట్రంలో ‘బీఏ4, బీఏ5’ రకం Covid వైరస్‌ వ్యాప్తి తీవ్రం: మంత్రి

చెన్నై: రాష్ట్రంలో ‘బీఏ 4’, ‘బీఏ5’ రకం కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉందని, కుటుంబంలో ఒకరికి వస్తే అందరికీ సోకే అవకాశముందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం హెచ్చరించారు. ఎగ్మూర్‌ ప్రసూతి ఆస్పత్రిలో శుక్రవారం ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సుల్లో పాల్గొన్న మంత్రి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో కరోనా వ్యాప్తి తీవ్రమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిందన్నారు. రాష్ట్రంలోనూ బీఏ4, బీఏ 5 రకం కరోనా వైరస్‌ ప్రబలుతోందని, కరోనాను ఎదుర్కొనే ఆయుధం టీకా మాత్రమేనని అన్నారు. కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేశామని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-07-02T18:16:04+05:30 IST