మంత్రి శ్రీరంగనాథ రాజు రాజీనామా చేయాలి: అనగాని

ABN , First Publish Date - 2021-03-28T22:06:05+05:30 IST

మంత్రి శ్రీరంగనాథ రాజు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

మంత్రి శ్రీరంగనాథ రాజు రాజీనామా చేయాలి: అనగాని

అమరావతి: మంత్రి శ్రీరంగనాథ రాజు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరిసాగుపై మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ప్రకటించారు. వరి సోమరిపోతు వ్యవసాయమని మంత్రి మాట్లాడటం సిగ్గుచేటని తప్పుబట్టారు. కష్టపడకుండా ఎలా పండించాలో రంగనాథరాజు చెప్తే రైతులు నేర్చుకుంటారన్నారు. రైతులకు క్షమాపణ చెప్పాలని అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ‘వరి ఒక సోమరిపోతు వ్యవసాయం’ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యానించారు. బయటి జిల్లాలకు వెళ్లినప్పుడు రైతులకు తాను ఇదే విషయం చెబుతుంటానని తెలిపారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరిగిన కృషి విజ్ఞానకేంద్రం రజతోత్సవంలో మంత్రి రంగనాథరాజు ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-03-28T22:06:05+05:30 IST