నల్గొండ: హైదరాబాద్‌కు వస్తున్న ఐటీ, ఇతర కంపెనీలను చూసి కేంద్రం గర్వపడాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పాలమూరు జిల్లా నుంచి ప్రజలు వలస వెళ్లేవారని, ఇప్పుడు జిల్లాకే వస్తున్నారని ఆయన చెప్పారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను కేంద్రం అమ్మాలనుకుంటోందన్నారు. జాతీయ హోదా ప్రాజెక్టులు తెలంగాణకు బీజేపీ నేతలు తీసుకురండని శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు.