కాంగ్రెస్‌ వల్లే పాలమూరుకు దరిద్రం

ABN , First Publish Date - 2020-10-20T05:51:03+05:30 IST

పాలమూరు దరిద్రానికి కాంగ్రెస్‌ పార్టే కారణమని మంత్రి వి.శ్రీ నివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. ఆరేళ్ల తెలంగాణ పాలన లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.

కాంగ్రెస్‌ వల్లే పాలమూరుకు దరిద్రం

శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 19: పాలమూరు దరిద్రానికి కాంగ్రెస్‌ పార్టే కారణమని మంత్రి వి.శ్రీ నివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. ఆరేళ్ల తెలంగాణ పాలన లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పొతల పథకం చేపడుతుంటే కాంగ్రెస్‌ జీర్ణించుకోలే కపోతున్నదని విమర్శించారు. సోమవారం మహ బూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. ఎల్లూరు పంప్‌ల ము నకకు సాంకేతిక లోపం కారణమై ఉండవచ్చని, ప్ర తిపక్షాలు మాత్రం ప్రభుత్వం తప్పు చేసినట్లు చిత్రీ కరించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. టీఆర్‌ఎ స్‌ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని అన్నారు. టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తే ప్రజలు ఓట్లు కాదని రాళ్లు రాలుస్తారన్నారు. అత్యధిక వరి దిగుబ డి చేస్తున్న రాష్ట్రంగా అవతరించడానికి కేసీఆర్‌ చేసిన భగీరథ ప్రయత్నమే కారణం కాదా అని ప్రశ్నించారు.


అప్పన్నపల్లి దగ్గర రెండో ఫ్లైఓవర్‌

పాలమూరు-జడ్చర్ల రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరిస్తున్నందున పాలమూరు సమీ పంలోని అప్పన్నపల్లి దగ్గర మరో ఫ్లైఓవర్‌ నిర్మిం చనున్నారు. ఇందుకోసం రూ.71 కోట్లు మంజూర య్యాయి. సోమవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పను లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ గతంలో బ్రిడ్జీ నిర్మించినప్పుడు ఇళ్లు కో ల్పోయిన వారిని కొంతమంది మోసం చేశారన్నారు. అలాంటి వారిని గుర్తించి క్రిమినల్‌ చర్యలకు సిద్ధ మవుతున్నామన్నారు. ఇప్పుడు దళారి వ్యవస్థ లేకుండా నేరుగా పరిహారం అందజేస్తామన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్‌కు విమానా శ్రయాన్ని తీసుకువస్తామని, వలసల జిల్లాకే వలస లు వాపస్‌ వచ్చేలా అభివృద్ధి చేస్తామని వెల్లడిం చారు. అభివృద్ధిపై ఎవరు సూచనలు చేసినా విన డానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, నాయకులు బాద్మి శివకుమార్‌, కోర మోని వెంకటయ్య, తాటిగణేష్‌, కట్టా రవి కిషన్‌రెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు. 


విద్యార్థులను అభినందించిన మంత్రి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: ఇటీవల విడు దలైన జాతీయ స్థాయి నీట్‌ ఫలితాల్లో జిల్లా కేం ద్రంలోని ప్రతిభ కళాశాలకు చేందిన 35 మంది  విద్యార్థులు మెడికల్‌ సీట్లు సాధించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విద్యార్థులను సోమవారం అభినందిం చారు. ప్రైవేట్‌ కళాశాల యాజమాన్యాలు విద్యార్థు లకు మెరుగైన విద్యనందించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల గౌరవ సలహాదారులు మంజులాదేవి, వి.లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, కె. జనా ర్దన్‌రెడ్డి, డైరక్టర్స్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ వెం కటరామయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-10-20T05:51:03+05:30 IST