5 నుంచి క్రీడా కార్యకలాపాలు

ABN , First Publish Date - 2020-08-02T09:11:34+05:30 IST

కొవిడ్‌-19తో నాలుగు నెలలుగా స్తంభించిపోయిన క్రీడా కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ...

5 నుంచి క్రీడా కార్యకలాపాలు

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

 హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కొవిడ్‌-19తో నాలుగు నెలలుగా స్తంభించిపోయిన క్రీడా కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈనెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలోని స్టేడియాల్లోకి క్రీడాకారులను సాధన చేసుకోవడానికి  అనుమతిస్తున్నట్టు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌డౌన్‌ 3.0లో భాగంగా క్రీడా కార్యకలాపాలు ప్రారంభించేందుకు పచ్చజెండా ఊపడంతో పలువురు క్రీడా ప్రముఖులతో మంత్రి  శనివారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి టీమిండియా మాజీ కెప్టెన్‌ అజరుద్దీన్‌, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్‌, అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌, షట్లర్లు సిక్కిరెడ్డి, సాయి ప్రణీత్‌, సుమీత్‌ రెడ్డి హాజరయ్యారు. సాధన చేసేట ప్పుడు క్రీడాకారులు భౌతిక దూరం పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన క్రీడా పాలసీకి క్రీడాకారులు సూచనలు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2020-08-02T09:11:34+05:30 IST