అత్యత్తుమ టూరిజం పాలసీ రూపొందించాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2022-02-03T02:07:47+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అత్యుత్తమ టూరిజం పాలసీ నీ రూపొందించటానికి టూరిజం అధికారులు తగిన ప్రతిపాదనలు, ప్రణాళికలను సిద్ధం చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టూరిజం అధికారులకు దిశానిర్దేశం చేశారు

అత్యత్తుమ టూరిజం పాలసీ రూపొందించాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అత్యుత్తమ టూరిజం పాలసీ నీ రూపొందించటానికి టూరిజం అధికారులు తగిన ప్రతిపాదనలు, ప్రణాళికలను  సిద్ధం చేయాలని  పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ టూరిజం అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం తన కార్యాలయంలో రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి  శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం లో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నాయి. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతికొద్ది సమయంలోనే రెండు అంతర్జాతీయ స్థాయి అవార్డుల ను సాధించాము. తెలంగాణ రాష్ట్రం లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో పర్యాటకులను రాష్ట్రానికి ఆకర్షించేందుకు, విదేశీ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించేందుకు టూరిజం అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. దేశంలోనే అత్యుత్తమ టూరిజం పాలసీ ని రూపొందించేందుకు టూరిజం అధికారులు అవసరమైన ప్రతిపాదనలు, ప్రణాళికలను రూపొందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. టూరిజం పాలసీ రూపకల్పన పై టూరిజం అధికారులు వివిధ టూరిజం నేపథ్యంలో ఉన్న దేశాలైన సింగపూర్, మలేసియా, దుబాయ్ లాంటి దేశాల్లో ఉన్న పాలసీలను పరిశీలించాలన్నారు.


దేశంలోని వివిధ రాష్ట్రాలైనా గోవా, కేరళ లాంటి రాష్ట్రాల టూరిజం పాలసీలను పరిశీలించి, అధ్యయనం చేసి, తెలంగాణ రాష్ట్రం లో అత్యుత్తమ టూరిజం పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పన పై దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు.  రాష్ట్రంలో ట్రైబల్, ఎకో, మెడికల్, టెంపుల్, హెరిటేజ్ టూరిజం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న పర్యాటక ప్రదేశాలను పర్యాటకుల  దృష్టికి తీసుకెళ్లేలా తగిన ప్రచారం నిర్వహించేలా కార్యక్రమాలు పాలసిలో ఉండేలా మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, టూరిజం ఉన్నతాధికారులు శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-03T02:07:47+05:30 IST