టూరిజం అవార్డును సీఎం చేతుల మీదుగా అందుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2022-01-18T23:59:35+05:30 IST

ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థ తొలిసారిగా నిర్వహించిన ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ ప్రతిష్టాత్మక పోటీలో తెలంగాణలోని యాదాద్రి భువన గిరి జిల్లా భూదాన్ పోచం పల్లి ఎంపికైన విషయం తెలిసిందే.

టూరిజం అవార్డును సీఎం చేతుల మీదుగా అందుకున్న మంత్రి  శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థ తొలిసారిగా నిర్వహించిన ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ ప్రతిష్టాత్మక పోటీలో తెలంగాణలోని యాదాద్రి భువన గిరి జిల్లా భూదాన్ పోచం పల్లి ఎంపికైన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు రాగా మన దేశం నుంచి సిఫారసు చేయబడ్డ మూడు గ్రామాల నుంచి భూదాన్ పోచంపల్లి గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది.


ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్, టూరిజం శాఖ ఎండి మనోహర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా అవార్డును, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంస్ధ జారీ చేసిన గుర్తింపు పత్రాన్ని సీఎంకేసీఆర్ చేతుల మీదుగా మంత్రి  శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించారు. టూరిజం అధికారులను కూడా సీఎం కేసీఆర్ అభినందించారు. 

Updated Date - 2022-01-18T23:59:35+05:30 IST