మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో అజారుద్దీన్‌ భేటీ

ABN , First Publish Date - 2020-08-09T21:57:01+05:30 IST

రాష్ట్ర క్రీడా , సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో మాజీ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్ధీన్‌ ఆదివారం ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో అజారుద్దీన్‌ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర క్రీడా , సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో మాజీ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్ధీన్‌ ఆదివారం ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌ తర్వాత రాష్ట్రంలో క్రికెట్‌  క్రీడాకారులు క్రికెట్‌ఆడేసమయంలో తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. క్రికెట్‌ క్రీడాకారులు బౌలింగ్‌ చేసేప్పుడు బాల్‌కు నోటిలోని ఉమ్మిని అంటించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. క్రికెట్‌ క్రీడాకారులు క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసేప్పుడు గుంపుగా , దగ్గరగా ఉండి మాట్లాడుకోవడం, మ్యాచ్‌ గురించి చర్చించడం వంటివి చేయవద్దన్నారు. క్రికెట్‌ క్రీడాకారులు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మరో టీంకు చెందిన ఆటగాడు ఔటయినప్పుడు మిగితా క్రీడాకారులు చేతులు కల్పడం, ఒకరినొకరు పట్టుకుని ఆనందం వ్యక్తం చేయడం వంటి చర్యలు కూడా చేయవద్దన్నారు. 


మ్యాచ్‌ ప్రాక్టీస్‌లో తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. శానిటైజర్‌ను వాడాలని , క్రీడాకారులు భౌతిక దూరం పాటించి కోవిడ్‌పై ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనలను పాటించాలన్నారు. క్రీడాకారుల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ , మంత్రి కేటీఆర్‌ క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. 

Updated Date - 2020-08-09T21:57:01+05:30 IST