దేశంలోనే నెంబర్ వన్ పర్యాటకంగా తెలంగాణ అభివృద్ధి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2022-01-30T01:42:18+05:30 IST

అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగంలో నిలబెట్టిన సీఎం కేసిఆర్ జిల్లాకొక ప్రధాన పర్యాటక క్షేత్రం అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే పర్యాటక రంగంలో నంబర్ వన్ గా తీర్చిదిద్దే ప్రణాళిక చేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

దేశంలోనే నెంబర్ వన్ పర్యాటకంగా తెలంగాణ అభివృద్ధి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

వరంగల్: అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగంలో నిలబెట్టిన సీఎం కేసిఆర్ జిల్లాకొక ప్రధాన పర్యాటక క్షేత్రం అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే పర్యాటక రంగంలో నంబర్ వన్ గా తీర్చిదిద్దే ప్రణాళిక చేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. లక్నవరంలో సస్పెన్షన్ బ్రిడ్జి, 24 కాటేజ్ లు, 2 గ్లాస్ కాటేజ్ లను మంత్రులు  సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి శనివారం నేడు ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్రంలో గట్టమ్మ, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామర్వాయి, మల్లూరు, బొగత జలపాతాలను ట్రైబల్ సర్క్యూట్ గా అభివృద్ధి చేసేందుకు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ములుగు ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 79.87 కోట్ల రూపాయలతో చేపట్టామని తెలిపారు.ఇందులో భాగంగా లక్నవరంలో 27.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.


 ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పర్యాటక శాఖ మంత్రిగా గతంలోచందూలాల్ ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ దీనిని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధితో వరంగల్ దిశ మారిపోయిందన్నారు సీఎం కేసిఆర్ పర్యాటక ప్రేమికులు కావడం వల్ల ఈ ట్రైబల్ సర్క్యూట్ ప్రాంతాలు గొప్ప పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.800 ఏళ్ల క్రితం కట్టిన రామప్పకు ఎంతో కష్టపడి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు.


 ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ లక్నవరంను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో అభివృద్ధి చేస్తుందన్నారు.సీఎం కేసిఆర్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఎనలేని ప్రేమ అని అన్నారు. ఆయన కృషి వల్ల రామప్పకి యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు.టి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత కాకతీయుల వారసత్వాన్ని కాపాడడంతో పాటు  పునః వైభవం తెచ్చారని చెప్పారు. 

Updated Date - 2022-01-30T01:42:18+05:30 IST