రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు

ABN , First Publish Date - 2022-01-12T22:12:51+05:30 IST

రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, వారి సేవలు మరువలేనివని శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు.

రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు

హైదరాబాద్: రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, వారి సేవలు మరువలేనివని శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను అమలు చేయడంలో పెన్షనర్లు సహకరించాలని కోరారు. తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన సంఘ వెబ్ సైట్, పెన్షనర్ల హ్యాండ్ బుక్,నూతన కేలండర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలు తనకు తెలుసునని, వారి సమస్యలు, పెన్షనర్లకు రావాల్సిన డీఆర్లను, పెన్షనర్లకు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ద`ష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. 


ఉద్యోగుల ఆరోగ్యపధకం పకడ్బందీగా అమలుచేయడానికి 1శాతం బేసిక్ పెన్షన్ లో మినహాయించుకుని నగర రహిత ఆరోగ్య చికిత్సను అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలుచేయడానికి ప్రభుత్వం కట్టుబడి వుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రిటర్డ్ గెజిటెడ్అధికారుల సంఘం ప్రెసిడెంట్ మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి నరసరాజు, సంఘం నాయకులు రవీందర్, యాదయ్య గౌడ్, విష్ణువర్ధన్ రావు, జయభారతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-12T22:12:51+05:30 IST