తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది: శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2022-01-03T00:37:31+05:30 IST

యువతలో క్రీడాస్పూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం తగినచర్యలు తీసుకుంటుందని క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: యువతలో క్రీడాస్పూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం తగినచర్యలు తీసుకుంటుందని క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్టీపీసీ వంటి సంస్థలు ఆర్చరీ (విలువిద్య) క్రీడలను నిర్వహించడానికి ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి తెలిపారు. ఆదివారం గచ్చీబౌలి స్టేడియంలో మొదటి ఎన్టీపీసీ నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. 


దేశంలో అతిపెద్ద గేమ్ గా ఆర్చరీ టోర్నమెంట్ నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా గౌరవ అతిధిగా  హాజరైన ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ సత్య మాట్లాడుతూ దేశంలోనే విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఎన్టీపీసిఎదిగిందన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్)లో భాగంగా ఎన్టీపీసీ వివిధ సేవా ,క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందన్నారు. దేశంలో క్రీడల ఉన్నతికి ఎన్టీపీసీ తన వంతు సాయం చేస్తుందని, ఆర్చరీ ఆఫ్ ఇండియాకు 2018 నుంచి సహకారం అందిస్తున్నామని అన్నారు. 


విలు విద్యలో ప్రావీణ్యం ఉన్న  క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏఏఐతో కలిసి పనిచేస్తామన్నారు. ఏఏఐని వేదికగా చేసుకుని విలువిద్యలో తమ టాలెంట్ ను మెరుగు పర్చుకునేందుకు యువతను ప్రోత్సహిస్తామన్నారు. దేశంలో ఆర్చరీ విద్యకు మరింత మెరుగులు పెట్టేందుకు పని చేస్తున్నట్టు ఆర్చరీ అసోసియేషన్ సెక్రకటరీ జనరల్ ప్రమోద్ చందూర్కర్ పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-03T00:37:31+05:30 IST