‘నీరా’లో పోషక విలువలు పుష్కలం

ABN , First Publish Date - 2022-01-01T21:20:31+05:30 IST

తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ఆరోగ్య ప్రదాయిని అని, ఇందులో పోషక విలువలు అధికంగా ఉన్నాయని, ఆబ్కారీ, పర్యాటక, శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

‘నీరా’లో పోషక విలువలు పుష్కలం

హైదరాబాద్: తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ఆరోగ్య ప్రదాయిని అని, ఇందులో పోషక విలువలు అధికంగా ఉన్నాయని, ఆబ్కారీ, పర్యాటక, శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ విషయం ఉస్మానియా విశ్వవిద్యాలయం కు చెందిన మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ డా. భీమా నేతృత్వంలో జరిగిన పరిశోధనలోనూ తేలిందన్నారు. ఈ సందర్భంగా డా.భీమా తోటి శాస్ర్తవేత్తలు డా. చంద్రశేఖర్, డా. శ్రీనివాస నాయక్ లతో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్  డా. భీమా నేతృత్వంలో వచ్చిన శాస్త్రవేత్తలతో చర్చించారు. డా. భీమా మైక్రోబయాలజీ రంగంలో గత 8 సంవత్సరాల నుండి పరిశోధనలు చేసి పీహెచ్ డి సాధించారన్నారు. 


అమెరికా లో పీడీఎఫ్ ను పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గా నీరా పై పరిశోధన లు నిర్వహిస్తున్నారన్నారని మంత్రి తెలిపారు. ఈ పరిశోధనలో తాటి, ఈత చెట్ల నుండి సేకరించిన నీరా దీర్ఘకాలం పాటు  సుమారు 6 నెలల పాటు నిల్వ ఉండే  విధంగా ప్రాసేస్ చేసి నీరాను సహజ సిద్దంగా ఉండేలా నీరాలో ఉండే పోషక విలువలు, క్యాన్సర్ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయని శాస్ర్తవేత్తలు మంత్రికి వివరించారు. అంతేగాకుండా కిడ్నీ స్టోన్ నివారణ కు సంబందించి ఓక్సలేట్ డికొర్ బాక్సిలేస్ ఎంజైమ్స్ (ఓడిఈ) సంవృద్దిగా ఉండి కిడ్నిలో రాళ్ళు ఎర్పడకుండా ఉపయేగపడుతుందని అధ్యాయనంలో తేలిందని మంత్రి కి వివరించారు.


నీరాలో ఇంత మేలైన సుగాణాలు ఉన్నాయని తన పరిశోధన ద్వారా తెలియజెప్పటంతోపాటు, నీరాను దీర్ఘ కాలం పాటు నిల్వఉండేలా గత సంవత్సర కాలం గా పరిశోధన లు చేసి మెరుగైన ఫలితాలు సాధించిన డా. భీమా ను, ఆయన బృందాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో గీత వృత్తిదారుల సంక్షేమం, గీత వృత్తి ప్రోత్సాహం ను అందించాలనే లక్ష్యం తో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ నీ ప్రవేశపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగా 20 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ లోని నెక్లస్ రోడ్డులో నీరా కేఫ్ ను ఏర్పాటు పనులను శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 


 డా. భీమా నేతృత్వంలో చేసిన పరిశోధన లో నీరా సహజ సిద్ధంగా దీర్ఘకాలం పాటు సహజత్వం కోల్పోకుండా వ్యాధి నిరోధక శక్తిని కలిగి  నిల్వ ఉండేలా తయారు చేసిన నీరా బాటిళ్లను వారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అందించారు. త్వరలో నీరా పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. నీరా ఉత్పత్తి కి, నీరా కేఫ్ ప్రారంభించడానికి కార్యాచరణ ను రూపొందిస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2022-01-01T21:20:31+05:30 IST