మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషనలు అమలు చేశాం

ABN , First Publish Date - 2021-11-10T21:33:04+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా గౌడ, ఎస్ సి, ఎస్టీలు ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషనలు అమలు చేశాం

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గౌడ, ఎస్ సి, ఎస్టీలు ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడ లకు 15 శాతం (363), ఎస్ సి లకు 10 శాతం (262), ఎస్ టి  కులస్తులకు రిజర్వేషన్ ప్రకారం కేటాయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2620  మద్యం దుకాణాలలో గౌడ, ఎస్సీ , ఎస్టీ కమ్యూనిటీలకు 756 దుకాణాలు కేటాయింపు చేసినట్లు తెలిపారు. 


1864 షాపులను ఓపెన్ కేటగిరీలో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. గౌడ, ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మద్యం షాపుల రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమదేనని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో  మద్యం దుకాణాలను పైన తెలిపిన కమ్యూనిటీలకు లాటరీ ద్వారా కేటాయించామన్నారు. ఈ విడత షాపుల యజమానులకు వెసులుబాటు  కల్పించామని, ముఖ్యంగా గతంలో రెండు బ్యాంకు గ్యారంటీలు  ఇవ్వవలసి ఉండగా, ఇప్పుడు ఒకటే గ్యారంటీ తీసుకోవడం జరుగుతుందన్నారు. దరఖాస్తు ఫీజు , లైసెన్స్ ఫీజు గత సంవత్సరం మాదిరిగానే అమలు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2021-11-10T21:33:04+05:30 IST