మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో శ్రీలంక ఎంబసీ డిప్యూటి హై కమీషనర్ భేటీ

ABN , First Publish Date - 2021-10-01T00:42:57+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తున్నారని అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి అన్నారు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో శ్రీలంక ఎంబసీ డిప్యూటి హై కమీషనర్ భేటీ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తున్నారని అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి  అన్నారు.అందులో భాగంగా నాగార్జున సాగర్ లో ప్రపంచ ప్రసిధ్ది గాంచిన బుద్దవనం ప్రాజేక్టును సుమారు 250 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే బుద్దవనం ప్రాజేక్టును సిఎం కెసిఆర్ చేతులమీదుగా ప్రారంబించబోతున్నామన్నారు. తెలంగాణ–శ్రీలంక ల మధ్య అధ్యాత్నిక, పర్యాటక, సాంస్కృతిక సంబందాలు బలోపేతం అయ్యేలా టూరిజం సర్క్యూట్ ను రూపోందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్  ఉన్నతాధికారులను అదేశించారు. 


మంత్రి శ్రీనివాస్ తో  శ్రీలంక దేశ ఎంబసీ లోని డిప్యూటి హై కమీషనర్ డా. డి. వెంకటేశ్వరన్ గురువారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో భేటి ఆయ్యారు.ఈ భేటిలో తెలంగాణ – శ్రీలంక ల మద్య పర్యాటకంగా, అధ్యాత్నికంగా, సాంస్కృతిక సంబందాల పై మంత్రి శ్రీనివాస్ గౌడ్  చర్చించారు. గౌతమ బుద్దుడు జీవించి ఉన్న కాలంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన బావరి తన 16 మంది శిష్యులతో బుద్దిడిని కలసి బుద్దిజం ను స్వీకరించారని చరిత్ర లో పేర్కొన్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ అదేశాలతో బుద్దిజం కేంద్రాలైన ఫణిగిరి, నేలకోండపల్లి, కోటిలింగాల, బోదన్ కుర్తి ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నామన్నారు. 


తెలంగాణ ప్రాంతంలో అచార్య నాగార్జునుడు దేశంలోనే తొలి బుద్దిజం యూనివర్శిటి విజయపురిని ప్రారంబించి వివిధ దేశాలకు చెందిన విద్యార్ధులకు బుద్దిజం ను బోదించి ప్రపంచానికి పరిచయం చేసారన్నారు.సీఎం కేసిఆర్ సమర్థవంతమైన పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అతివేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రమని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నామని వివరించారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మేన్ ఉప్పల శ్రీనివాస గుప్తా, సంస్థ ఎండి మనోహర్, రాజా బస్వారాజ్, నర్రా శ్రీనివాస్ గారు తదితరులు పాల్గోన్నారు.

Updated Date - 2021-10-01T00:42:57+05:30 IST