ఉమ్మడి పాలనలో వాల్మీకి మహర్షి జయంతిని నిర్లక్ష్యం చేశారు

ABN , First Publish Date - 2020-11-01T01:42:54+05:30 IST

ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు వాల్మీకి మహర్షిని నిర్లక్ష్యం చేశారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు.

ఉమ్మడి పాలనలో వాల్మీకి మహర్షి జయంతిని నిర్లక్ష్యం చేశారు

హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు వాల్మీకి మహర్షిని నిర్లక్ష్యం చేశారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. వాల్మీకి గొప్పదనం గురించి ప్రపంచానికి చాటు చెబుతున్నామని అన్నారు. శనివారం వాల్మీకి జయంతి సందర్భగా రవీంద్ర భారతిలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో బోయల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు.


బిసిల ఆత్మగౌరవ భవనం కోసం ఎంతో విలువైన భూమితో పాటు కోటి రూపాయల నిధులు కేటాయించారని అన్నారు. వచే సంవత్సరం వాల్మీకి జయంతిని సొంత భవనంలో నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు. బోయలను ఎస్టీల జాబితాలోకి తీసుకు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బోయ సంఘం అధ్యక్షుడు గట్టు తిమ్మన్న, తిరుమలేశ్‌ నాయుడు, టీఆర్‌ఎస్‌నాయులు శ్రీనివాస్‌, గంధం రాములు, బోయగోపి, బొగ్గు వెంకటేశ్‌, రేపల్లె కృష్ణమనాయుడు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-01T01:42:54+05:30 IST