రైతులు సంఘటిత శక్తిగా ఎదగాలి

ABN , First Publish Date - 2020-07-09T12:01:50+05:30 IST

రైతులు సంఘటిత శక్తిగా ఎదిగి ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ..

రైతులు సంఘటిత శక్తిగా ఎదగాలి

 వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


ఆమనగల్లు : రైతులు సంఘటిత శక్తిగా ఎదిగి ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి  అన్నారు. తలకొండపల్లి మండలం వెల్జాల, పడకల్‌, రాంపూర్‌, చుక్కాపూర్‌ గ్రామాల్లో బుధవారం మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాల్లో నాగర్‌ కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, టీఆర్‌ఎ్‌స్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ వంగేటి లక్ష్మారెడ్డిలతో కలిసి రైతు వేదిక భవనాల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చుక్కాపూర్‌లో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. 


నియంత్రిత సాగు విధానం రైతులకు  ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీలు ఉప్పల వెంకటేశ్‌, విజితారెడ్డి, ఎంపీపీ నిర్మలాశ్రీశైలంగౌడ్‌, వైస్‌ ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, సర్పంచ్‌లు సంగీత శ్రీనివా్‌సయాదవ్‌, శ్యామ్‌సుందర్‌రెడ్డి, రమేశ్‌, కిష్టమ్మ, ఎంపీటీసీలు అంబాజీ, రమేశ్‌, వందన శ్రీనివా్‌సరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, జక్కు అనంతరెడ్డి, వస్పుల జంగయ్య, జగన్‌రెడ్డి, అర్జున్‌ రావు, భాస్కర్‌రెడ్డి, స్వప్న పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T12:01:50+05:30 IST