ఉచిత ప్రయాణానికి స్మార్ట్‌ కార్డులు

ABN , First Publish Date - 2022-06-14T15:35:57+05:30 IST

కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం స్మార్ట్‌ కార్డులు పంపిణీ చేస్తామని అప్పటివరకు పాత బస్సు పాస్‌లపైనే ప్రయాణం

ఉచిత ప్రయాణానికి స్మార్ట్‌ కార్డులు

- ప్రైవేటు స్కూల్‌ బస్సుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి

- రవాణా మంత్రి శివశంకర్‌


అడయార్‌(చెన్నై), జూన్‌ 13: కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం స్మార్ట్‌ కార్డులు పంపిణీ చేస్తామని అప్పటివరకు పాత బస్సు పాస్‌లపైనే ప్రయాణం చేయవచ్చని రవాణా శాఖామంత్రి ఎస్‌.ఎస్.శివశంకర్‌ తెలిపారు. ఆయన సోమవారం పెరంబలూరు జిల్లాలో మాట్లాడుతూ, కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్యపెరిగిందన్నారు. దీనికి కారణం ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సీఎం.స్టాలిన్‌ ప్రకటించడమేనని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు బస్‌ పాస్‌ల స్థానంలో స్మార్ట్‌కార్డులను జారీచేస్తామన్నారు. అప్పటివరకు పాత బస్‌పా్‌సలపైనే ప్రయాణించవచ్చన్నారు. ప్రైవేటు పాఠశాలలకు చెందిన స్కూల్‌ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చాలని ఆదేశించామన్నారు. దీనిని పాటిస్తున్నారా లేదా అనే విషయంపై అధికారులు తనిఖీలు చేస్తారని తెలిపారు. 

Updated Date - 2022-06-14T15:35:57+05:30 IST