Minister's Statement: మరోసారి చర్చిద్దాం

ABN , First Publish Date - 2022-08-04T14:28:37+05:30 IST

ప్రభుత్వ రవాణా సంస్థ కార్మికుల డిమాండ్లపై కార్మిక సంఘాల ప్రతినిధులతో మరో విడత చర్చలు జరుపనున్నట్లు రవాణా శాఖ మంత్రి శివశంకర్‌(Transpo

Minister's Statement: మరోసారి చర్చిద్దాం

- రవాణా కార్మికులతో ప్రభుత్వ చర్చల్లో స్తంభన !

- వారి డిమాండ్లను పరిశీలిస్తాం: మంత్రి శివశంకర్‌ 


చెన్నై, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రవాణా సంస్థ కార్మికుల డిమాండ్లపై కార్మిక సంఘాల ప్రతినిధులతో మరో విడత చర్చలు జరుపనున్నట్లు రవాణా శాఖ మంత్రి శివశంకర్‌(Transport Minister Sivashankar) ప్రకటించారు. క్రోంపేటలోని రవాణా సంస్థ కార్యాలయంలో తొళిలాలర్‌ మున్నేట్ర సంఘం (డీఎంకే కార్మికవిభాగం), సీఐటీయూ, అన్నాడీఎంకే కార్మిక సంఘం సహా 66 కార్మిక సంఘాల ప్రతినిధులతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆరోవిడత చర్చలు నిర్వహించారు. ఈ చర్చల్లో రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గోపాల్‌, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి అరుణ్‌ సుందర్‌ దయాళన్‌(Arun Sundar Dayalan), కార్మిక సంక్షేమ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీకాంతన్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 14వ వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని, పదవీ విరమణ చేసే రోజూ గ్రాట్యూటీ తదితర చెల్లింపులన్నింటినీ అందజేయాలని రవాణా కార్మికులు కోరుతున్నారు. ఈ డిమాండ్లను సత్వరమే ఆమోదించకుంటే సమ్మెకు దిగుతామంటూ కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కార్మిక సంఘాలతో చర్చలు ముగిశాయి. ఆ సందర్భంగా మంత్రి శివశంకర్‌(Shivashankar) విలేఖరులతో మాట్లాడుతూ... చర్చలు సాఫీగా జరిగాయని, కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లను తెలుసుకున్నామని, ఈ వివరాలను సీఎం స్టాలిన్‌కు తెలియజేస్తానని తెలిపారు. అదే సమయంలో కార్మిక సంఘాలతో త్వరలో మరో విడత చర్చించి తగిన నిర్ణయాలను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

Updated Date - 2022-08-04T14:28:37+05:30 IST