ఆన్‌లైన్‌ ద్వారా రూ.175 కోట్ల అద్దె వసూలు

ABN , First Publish Date - 2022-05-12T15:29:06+05:30 IST

హిందూ దేవాదాయ శాఖ నిర్వహణ లో ఉన్న ఆలయాల్లో కొత్తగా ప్రారంభించిన ఆన్‌లైన్‌ విధానం ద్వారా రూ.175 కోట్లకు పైగా అద్దె వసూలైందని ఆ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు

ఆన్‌లైన్‌ ద్వారా రూ.175 కోట్ల అద్దె వసూలు

                      - మంత్రి పీకే శేఖర్‌బాబు


ప్యారీస్‌(చెన్నై): హిందూ దేవాదాయ శాఖ నిర్వహణలో ఉన్న ఆలయాల్లో కొత్తగా ప్రారంభించిన ఆన్‌లైన్‌ విధానం ద్వారా రూ.175 కోట్లకు పైగా అద్దె వసూలైందని ఆ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు పేర్కొన్నారు. ఆవడి కార్పొరేషన్‌ పరిధిలోని కొవిల్‌పాతకి ప్రాంతంలో ఉన్న పురాతన సుందరరాజపెరుమాళ్‌ ఆలయాన్ని మంత్రి శేఖర్‌బాబు బుధవారం సందర్శించారు. ఈ ఆలయానికి చెందిన స్థలంలో గోశాల కోసం ఎంపిక చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సుందరరాజపెరుమాళ్‌ ఆలయానికి చెందిన సుమారు 25 ఎకరాల్లో రూ.20 కోట్లతో గోశాల ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆలయాలకు భక్తులు కానుకగా అందజేసే పశువులను ఈ గోశాల లో సంరక్షించనున్నట్లు మంత్రి తెలిపారు.

Read more