షెడ్యూల్డ్ ప్రాంతాలకు చెందిన చట్టాలపై దృష్టి సారించాలి:మంత్రి Satyavathi

ABN , First Publish Date - 2022-06-25T00:12:40+05:30 IST

షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన అన్ని చట్టాలపై దృష్టి సారించాలని రాష్ట్ర గిరిజన స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(satyavathi rathore) అధికారులకు సూచించారు

షెడ్యూల్డ్ ప్రాంతాలకు చెందిన చట్టాలపై దృష్టి సారించాలి:మంత్రి Satyavathi

హైదరాబాద్: షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన అన్ని చట్టాలపై దృష్టి సారించాలని రాష్ట్ర గిరిజన స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(satyavathi rathore) అధికారులకు సూచించారు.డీఎస్ఎస్ భవన్ లో ఐటిడిఏ ప్రాజేక్ట్ (itda project)అధికారులతో నిర్వహించిన రెండు రోజుల ట్రేనింగ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.ఈ సమావేశంలోనూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో గురుకుల ఆశ్రమ పాఠశాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు చేరడం సంతోష కరమని అన్నారు. వేరు వేరు ప్రాంతాల్లో యుఆర్జే సీ లో చదువుతున్న విద్యార్థులు ఒకరు ఆనారోగ్యంతో, మరొకరు పురుగులమందు సేవించి మరణించిన ఘటనలపై మంత్రి సీరియస్ గా  స్పందించారు. గురుకుల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.  


ఇతర ప్రాంతాల నుండి వస్తున్న విద్యార్ధుల ప్రస్థుత ఆరోగ్య, మానసిక పరిస్థితి పై అధికారులు దృష్టి సారించాలని, విద్యార్ధులకు స్ర్కినింగ్ టెస్ట్ లు నిర్వహించాలని అన్నారు. అనారోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా వారి తల్లిదండ్రులకు తెలియచేయటంతో  పాటు అవసరమైతే, ఆసుపత్రిలో చెర్పించి మేరుగైన వైద్యం అందే విధంగా చూడాలని సూచిచంచారు.విద్యార్ధులకు ఎమైనా సమస్యలు ఉంటే  అడిగి తెలుసుకుని పరిష్కరించాలన్నారు.ఈ ఏడాది ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో ఆశ్రమ పాఠశాలలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరడం సంతోషకరమని అన్నారు.విద్యార్థులకు మరింత మెరుగైన విధ్యను అందించే దిశగా కృషి చేయాలని తెలిపారు.  


విద్యార్థులకు అందవలసిన యూనిఫామ్, పుస్తకాలు దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలతో పాటు ఇతర సౌకర్యాలు అన్నీ సత్వరమే కల్పించాలని అన్నారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు వారికి మేనూ ప్రకారం భోజనం అందేలా చూడాలన్నారు.గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా పోడు భూముల సమస్య ఎక్కడైనా తలెత్తితే వెంటనే పరిష్కార  దిశగా కృషి చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. వర్షా కాలం మొదలైన క్రమంలో ఏజెన్సీ గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంప్ లు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు,స్పెషల్ సెక్రెట్రరి శ్రీధర్,గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T00:12:40+05:30 IST