Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళల రక్షణలో తెలంగాణ నంబర్ వన్: Minister satyavati

హైదరాబాద్: మహిళల రక్షణలో తెలంగాణ నంబర్ వన్‌ స్థానంలో ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బంజారాహిల్స్ మిథాలి నగర్లో సఖీ సెంటర్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ  మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇతర రాష్ట్రాలు వచ్చి నేర్చుకుంటున్నాయని తెలిపారు. మహిళల భద్రత కోసం ఏం చేయడానికి అయినా ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. మొన్ననే గంజాయి నిర్ములన కోసం సీఎం సమీక్ష చేసి చర్యలకు ఆదేశించారన్నారు. అక్కడక్కడా చిన్న సంఘటనలు జరుగుతున్నాయని...మహిళల భద్రత కోసం పొలీస్ శాఖ తీవ్ర కృషి చేస్తోందని తెలిపారు. కొన్ని సఖీ సెంటర్స్ ప్రైవేట్ భవనాల్లో ఉన్నాయని, త్వరలోనే వాటికి శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఎమ్మెల్సీ వాణి దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement