కరోనా వచ్చిన వారి పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ

ABN , First Publish Date - 2021-05-07T10:07:48+05:30 IST

కరోనా బారిన పడిన పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. చిన్నారులకు కరోనా సోకితే

కరోనా వచ్చిన వారి పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ

అధికారులకు మంత్రి సత్యవతి ఆదేశాలు 


హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడిన పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. చిన్నారులకు కరోనా సోకితే తగిన చికిత్స అందించాలన్నారు. అనేక మంది తల్లిదండ్రులు కరోనా బారిన పడుతున్నారని, వారి పిల్లలను వైరస్‌ నుంచి రక్షించేందుకు హైదరాబాద్‌లోని శిశు విహార్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. కరోనా బారిన పడిన వారి పిల్లలను శిశు విహార్‌కు తరలించేందుకు, ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆమె శిశు విహార్‌లోని చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ డెస్క్‌ను సందర్శించారు.

Updated Date - 2021-05-07T10:07:48+05:30 IST