అంగన్‌వాడీ కేంద్రాల్లో నిత్యావసరాల పంపిణీ- సత్యవతి రాథోడ్‌

ABN , First Publish Date - 2020-04-10T20:11:51+05:30 IST

కరోనా మహమ్మారి బారీ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది.

అంగన్‌వాడీ కేంద్రాల్లో నిత్యావసరాల పంపిణీ- సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి బారీ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. ఈసమయంలో పేదలు ఇబ్బంది పడొద్దనే ముఖ్యమ్రంతి కేసీఆర్‌ ఆలోచన మేరకు  అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన బాలింతలు, గర్బిణీలు, పిల్లలకు పాలు, గుడ్లు, బాలామృతం, నిత్యావసరాలను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర గిరిజన, మహిళా,శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరుకులు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారన్నవిషయం పై శుక్రవారం మాసాబ్‌టాంక్‌ వద్ద ఎంజీ నగర్‌ అంగన్‌వాడి కేంద్రాన్ని మంత్రి సత్యవతి పరిశీలించారు. ఈసందర్భంగా అక్కడ నమోదైన బాలింతలు, గర్బిణీస్ర్తీలు, పిల్లలకు సరుకులు, శానిటైజర్లు, మాస్క్‌లు కూడా పంపిణీ చేశారు. ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తోందని, ఈ సమయంలోనే మన అవసరం ప్రజలకు ఎక్కువగా ఉందని, వారికి ప్రభుత్వ సేవలన్నీ సకాలంలో అందించి ఆదుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పాలు, గుడ్లు, నూనె, పప్పు, బియ్యం, బాలామృతం, నిత్యావసరాలకు ఎలాంటి కొరత రాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తూ అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకుంటుందన్నారు.


అదే విధంబగా తమ సేవలను నిరాటంకంగా అందిస్తున్న అంగన్‌వాడీల స్వీయ రక్షణ కోసం శానిటైజర్లు, మాస్క్‌లు కూడా ఇప్పటికే అందించామని మంత్రి తెలిపారు. అంగన్‌వాడీలు బాగా పనిచేస్తున్నాయని అన్నారు. వీరి సేవలు బాగా ఉన్నాయని నీతి ఆయోగ్‌ కూడా ప్రశంసించిందన్నారు. లాక్‌డౌన్‌ అయిన వెంటనే అంగన్‌వాడీల ద్వారా మొదటి 12 రోజులకు సరిపడా సరుకులు అందించామని, ఇప్పుడు రెండో విడత సరుకులు అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంగన్‌వాడీలంటే ఇష్టమని, అందుకే ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకున్నా వారి ఇబ్బందును  గుర్తించి ఇంటికి పిలిచి వేతనాలు ఇవ్వడం, వారి వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. అంగన్‌వాడీలు కూడ కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశుసంక్షేమశాఖ కమిషనర్‌ దివ్య, జిల్లా సంక్షేమాధికారి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-10T20:11:51+05:30 IST