అనాధ పిల్లల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది: మంత్రి సత్యవతి

ABN , First Publish Date - 2021-08-19T01:34:16+05:30 IST

రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితిగతులు మెరగు పర్చి, వారి భవిష్యత్ కు బంగారు బాట వేసే లక్ష్యంతో సీఎం కేసిఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి

అనాధ పిల్లల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది: మంత్రి సత్యవతి

హైదరాబాద్: రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల  స్థితిగతులు మెరగు పర్చి, వారి భవిష్యత్ కు బంగారు బాట వేసే లక్ష్యంతో సీఎం కేసిఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. మంత్రి  అధ్యక్షతన ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోమ్ ను సందర్శించి, అక్కడి వసతులను, పిల్లల ఆరోగ్య, విద్యా పరిస్థితులను పరిశీలించారు. హోమ్ లో 58 మంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. మంత్రులు పిల్లలతో  మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. 


ఇంకా ఎలాంటి వసతులు కల్పిస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేస్తే సంతోషంగా ఉంటారో చెప్పాలని అడిగారు.మంత్రులు ఇద్దరూ పిల్లలని దగ్గరకు తీసుకొని, వారితో మాట్లాడారు. హోమ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? భోజనం, చదువు బాగా ఉందా అని అడిగి తెలుసుకున్నారు.తల్లిదండ్రులు లేరని అనుకోవద్దని ప్రభుత్వమే ఇక తల్లిదండ్రి గా అన్ని బాధ్యతలు తీసుకొని, ఈ రాష్ట్ర బిడ్డలుగా మీ సంరక్షణ చేస్తుందని, ఏ లోటూ లేకుండా చూస్తుందని చెప్పారు. సీఎం కేసిఆర్ ఒక తండ్రిగా గొప్ప మనసుతో ఆలోచించి మీకు విద్య, భోజనం, వసతితో పాటు ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరవాత మంచి భవిష్యత్ అందించాలన్న ఆలోచనతో ఉన్నారని, దేనికి దిగులు పడకుండా బాగా చదువుకోవాలని వారికి ప్రోత్సాహం కల్పించారు. 


అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల అనాథలు అయిన వారి బాగోగులు చూసి, వారి బంగారు భవిష్యత్ కోసం సీఎం కేసిఆర్ కేబినెట్ సబ్ కమిటీ వేశారని అన్నారు. పిల్లలు అనాథలు కాకుండా వారిని రాష్ట్ర ప్రభుత్వ పిల్లలుగా గుర్తించాలన్నారు.ఈ పిల్లలందరికీ సీఎం కేసిఆర్ ప్రకటించే ప్యాకేజీ వారి బంగారు భవిష్యత్ తీర్చిదిద్దే విధంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసిఆర్ ఏం చేసినా ఆ కార్యక్రమం లోతుల్లోకి వెళ్లి చేస్తారు. అందులో భాగంగానే అనాథల కోసం మంచి కార్యక్రమం చేయాలని నిర్ణయించారని అన్నారు.అనాథ పిల్లలకు అమ్మ, నాన్న ప్రభుత్వమే కావాలన్నదే సీఎం కేసిఆర్ ఆలోచనగా ఆమె పేర్కొన్నారు.


Updated Date - 2021-08-19T01:34:16+05:30 IST