హైదరాబాద్: రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో వినకపోతే కేంద్రం మెడలు వంచుతామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిక్కుమాలిన సందర్శనలను మానుకోవాలని ఆమె సూచించారు. కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ రైతులకు మేలు చేయాలని సంజయ్‌కు మంత్రి హితవు పలికారు.