రాష్ట్రానికి నిధులివ్వకుండా ప్రగతిని అడ్డుకుంటున్న బీజేపీ

ABN , First Publish Date - 2021-03-05T05:32:39+05:30 IST

రాష్ట్రానికి నిధులివ్వకుండా ప్రగతిని అడ్డుకుంటున్న బీజేపీ

రాష్ట్రానికి నిధులివ్వకుండా ప్రగతిని అడ్డుకుంటున్న బీజేపీ
మహబూబాబాద్‌లో టీఆర్‌ఎ్‌సకేవీ అనుబంధ సంఘాల బాధ్యులతో మంత్రి సత్యవతిరాథోడ్‌

మంత్రి సత్యవతిరాథోడ్‌

మహబూబాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రానికి రా వాల్సిన నిధులను కేంద్రం ప్రభుత్వం ఇవ్వకుండ తెలంగాణ ప్రగతికి అడ్డుపడుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ విమర్శించారు. బీజేపీ పాలనలో సామాన్యులకు ఓరిగిందేమి లేదని, అంబానీ, ఆదానీలకు మేలు చేసే విధంగా నూతన చట్టాలు తీసుకువస్తున్నారని  దుయ్యబట్టారు. మహబూబాబాద్‌ గంగపుత్ర భవనంలో టీఆర్‌ఎ్‌సకేవీ అనుబం ధ సంఘాల బాధ్యులు, ఐఎంఏ  హాల్‌లో అంగన్‌వాడీ టీచర్లతో గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ.. బీజేపీ నేతల పాపం పెరిగినట్టే  గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతు న్న బీజేపీ పాలకులకు పేదలు బుద్ధి చెబుతారని అన్నారు. బ య్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలు ఇవ్వకుండ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల వేతనాలను పెంచి గౌరవాన్ని పెంపొందించిందని మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. అంగన్‌వాడీలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. అంగన్‌వాడీలు అంటే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానమని, అందుకే రెండుసార్లు వేతనాలు పెంచి వర్కర్ల నుంచి టీచర్లుగా సంబోదించే విధంగా నిర్ణయం తీసుకుని గౌరవం పెంచారన్నారు. అంగన్‌వాడీలు టీఆర్‌ఎస్‌ పా ర్టీకి అండగా నిలబడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలి.  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నూకల శ్రీరంగారెడ్డి, టీఆర్‌ఎ్‌సకేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, అంగన్‌వాడీల రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, జిల్లా అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి, వాణి, జహేరా, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. 

కురవి : కురవి మండలం మొగిలిచర్ల గ్రామంలో ఇటీవల మృతి చెందిన తీగల ఉప్పలయ్య కుటుంబాన్ని మంత్రి సత్యవతిరాథోడ్‌ పరామర్శించారు. జడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, బాదె నాగయ్య, బోడ శ్రీను ఉన్నారు.

 

Updated Date - 2021-03-05T05:32:39+05:30 IST