ప్రజాభిప్రాయంతోనే మెరుగైన పాలన

ABN , First Publish Date - 2020-05-26T10:12:17+05:30 IST

ప్రజాభిప్రాయంతోనే మెరుగైన పాలన అందించటం సాధ్యమనీ, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన పాలన-మీ సూచనలు’ పేరుతో ఆరు రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని..

ప్రజాభిప్రాయంతోనే మెరుగైన పాలన

మంత్రి శంకరనారాయణ ‘మన పాలన- మీ సూచనలు’  కార్యక్రమానికి శ్రీకారం


అనంతపురం, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాభిప్రాయంతోనే మెరుగైన పాలన అందించటం సాధ్యమనీ, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన పాలన-మీ సూచనలు’ పేరుతో ఆరు రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. లబ్ధిదారులు, నిపుణులు, మేధావుల సూచనలు తీసుకుని, వాటిని నివేదిక రూపంలో  ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ‘మన పాలన-మీ సూచనలు’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మేధోమథన సదస్సు నిర్వహించారు. తొలిరోజు పరిపాలన, సంక్షేమంపై వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు, నిపుణుల సూచనలు స్వీకరించారు.


మంత్రి మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి లోటుపాట్లు తెలుసుకోవటానికే సీఎం జగన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకూ మేధోమథనం కార్యక్రమాలు నిర్వహి స్తామన్నారు. రానున్న నాలుగేళ్లలో ఎలాంటి కార్యక్ర మాలు చేయాలో ప్రజల నుంచి సూచనలు తీసుకునేం దుకే ఈ సమీక్షలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరి పాలన, సంక్షేమం అంశంపై జరిగిన సదస్సులో వివిధ వ ర్గాల నుంచి వచ్చిన సూచనలను ఏ రోజుకారోజు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, సిద్దారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జాయింట్‌ కలెక్టర్‌ సిరి, వివిధ రంగాల నిపుణులు  పాల్గొన్నారు.


గ్రామ స్వరాజ్యనిధి ఏర్పాటు చేశాం:సీఎంతో ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచోఫెర్రర్‌

గ్రామ స్వరాజ్యనిధి ఏర్పాటు చేసి తద్వారా వచ్చే వడ్డీ తోనే 20 ఏళ్లుగా గ్రామానికి కావాల్సిన అవసరాలు తీరు స్తున్నామని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచోఫెర్రర్‌.. ము ఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి తెలిపారు. సీఎం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వ హించిన ‘మన పాలన-మీ సూచనలు’ కార్యక్రమంలో భా గంగా పరిపాలన సంక్షేమంపై నిపుణులు, లబ్ధిదారులు, అధికారులతో ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా నుంచి మాంచోఫెర్రర్‌ ముఖ్యమంత్రితో మాట్లాడారు.  కొవిడ్‌ సమయంలో వలంటీర్లు బాగా సేవలందించారన్నారు. అది కళ్లారా చూశామన్నారు. గ్రామస్థాయిలో మార్పులు రావాలంటే అధికారంతో పాటు నిధులు కావాలన్నారు. అవి ఉంటేనే ఉత్సాహం, బాధ్యత పెరుగుతుందన్నారు. ఆర్డీటీ సేవలను సీఎం కొనియాడారు.

Updated Date - 2020-05-26T10:12:17+05:30 IST