Rangareddy: 15 రోజుల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తి చేయాలి: మంత్రి సబితారెడ్డి

ABN , First Publish Date - 2022-05-19T23:38:04+05:30 IST

రాష్ట్రంలోని 9,300 పాఠశాలల్లో ఫర్నిచర్, ఫ్యాన్లు, లైట్లు, తదితర మౌలిక వసతులను 15 రోజుల్లో సమకూర్చాలని మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఆమె మనఊరు - మనబడి

Rangareddy: 15 రోజుల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తి చేయాలి: మంత్రి సబితారెడ్డి

Rangareddy: రాష్ట్రంలోని 9,300 పాఠశాలల్లో ఫర్నిచర్, ఫ్యాన్లు, లైట్లు, తదితర మౌలిక వసతులను 15 రోజుల్లో సమకూర్చాలని మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఆమె మనఊరు - మనబడి కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 60 శాతం విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో కనీస సౌకర్యాలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. 1 నుంచి 8 తరగతి వరకు ఇంగ్లీషు, తెలుగు మీడియ పుస్తకాల ముద్రణ జరుగుతుందని, కాస్తా ఆలస్యమైనా.. జూన్ రెండో వారానికి పుస్తకాలు అందిస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్, పేరెంట్స్ మీటింగ్ ఉంటుందన్నారు. 23 నుంచి పదో తరగతి పరీక్షలు ఉంటాయని, అందుకు అన్నిఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. గ్రామాల పరిధిలో పంచాయతీలు పాఠశాలలు క్లీన్ చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కేటాయిస్తారని చెప్పారు. జూన్ ఒకటి నుంచి బడి బాట Iటుందన్నారు. 

Updated Date - 2022-05-19T23:38:04+05:30 IST