ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లు పెరిగాయి: మంత్రి సబిత

ABN , First Publish Date - 2021-08-12T23:16:04+05:30 IST

రాష్ట్రంలో విద్యాభివృద్దికోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా ప్రభుత్వ విద్యపై విద్యార్థులకు

ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లు పెరిగాయి: మంత్రి సబిత

హైదరాబాద్‌: రాష్ట్రంలో  విద్యాభివృద్దికోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా ప్రభుత్వ విద్యపై విద్యార్థులకు నమ్మకం పెరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్మీడియట్‌లో గణనీయంగా అడ్మిషన్లు పెరిగాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 52 వేలు ఉన్న విద్యార్థుల సంఖ్య 1.9 లక్షలు దాటిందన్నారు. ఇంటర్ విద్యలో సంస్కరణలు అమలు చేశామన్నారు. ప్రతి ఐదేళ్లకొకసారి సబ్జెక్ట్ రివైజ్ చేశామన్నారు. సెకండియర్ తెలుగు, ఫస్టియర్ ఇంగ్లీష్ పాఠ్యాంశాలను రివైజ్ చేశామన్నారు. రాష్ట్రంలోని విద్యార్థలందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఉచిత పుస్తకాలకు 9 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-08-12T23:16:04+05:30 IST