Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 10 2021 @ 21:40PM

బాలాపూర్ గణేశుడి సేవలో మంత్రి సబిత

రంగారెడ్డి:  వినాయకచవితి సందర్భంగా జిల్లాలోని బాలాపూర్ గణనాథుడి తొలి పూజలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో బాలపూర్ గణనాథుడు ఉండడం.. అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. బాలపూర్ గణేశుడికి కూడా అంతే ఉందని చెప్పారు. మొదటి పూజ, నిమజ్జనం రోజున మొదట కదిలేది కూడా బాలాపూర్ గణేశుడే అని గుర్తు చేశారు. కరోనా కష్టాలను పారద్రోలాలని దేవున్ని ప్రార్థించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్తోందన్నారు. తెలంగాణను ఇంకా ముందుకు నడిపించే శక్తిని.. కేసీఆర్‌కు ఇవ్వాలని వినాయకుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement
Advertisement