శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారభించిన మంత్రి రోజా

ABN , First Publish Date - 2022-05-04T16:12:51+05:30 IST

శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను మంత్రి రోజా ప్రారంభించారు.

శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారభించిన మంత్రి రోజా

విజయవాడ: శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను బుధవారం ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో పర్యాటక, క్రీడా శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వల్ల రెండేళ్లు ఇళ్లకే పరిమితం అయ్యామన్నారు. క్రీడలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా ఇస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఎదగవచ్చునని, 48 క్రీడా అంశాలలో రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలుగులోకి తెస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో స్పోర్ట్స్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తామన్నారు. 


ఆక్రమణలో ఉన్న క్రీడా ప్రాంగణాలు స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా స్పష్టం చేశారు. విశాఖలో వాటర్ స్పోర్ట్స్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి ఏడాది మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తామన్నారు. కేంద్రం నుంచి కూడా క్రీడలకు నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తదితరులు పాల్గొన్నారు.

Read more