అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలే- మంత్రి పువ్వాడ

ABN , First Publish Date - 2020-08-04T23:37:21+05:30 IST

అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కళిన చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువవ్వాడ అజయ్‌కుమార్‌ అఽధికారులను సున్నితంగా హెచ్చరించారు.

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలే- మంత్రి పువ్వాడ

ఖమ్మం: అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కళిన చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువవ్వాడ అజయ్‌కుమార్‌ అఽధికారులను సున్నితంగా హెచ్చరించారు. మంగళవారం ఖమ్మం మున్సిపల్‌కార్పొరేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై మున్సిపల్‌ కమిషనర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల ఆలసత్వం పట్ల అసంతృప్తిని వ్యక్తంచేశారు. కొనసాగుతున్న ఆయా పనులపై కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల నుంచి  పనుల నివేదికను కోరాలని మంత్రి సూచించారు. సకాలంలో పూర్తి చేయకపోతే చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా నగరంలోని ఎన్‌ఎస్‌పి క్యాంప్‌లోని వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ ప్రాంగణంలో 23 లక్షలతో నిర్మించ తలపెట్టిన వీధి వ్యాపారులకు దుకాణాల సముదాయాల నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ పరిశీలించారు. 


ఆగస్ట్‌ 15 నాటికల్లా పూర్తిచేయాలని మున్సిపల్‌కార్పొరేషన్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతిని ఆదేశించారు. తర్వాత గట్టయ్య సెంటర్‌లో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్‌ భవనాన్ని కూడా మంత్రి సందర్శించారు. పనుల జాప్యం పై అసంతప్తి వ్యక్తం చేశారు. పనుల ఆలస్యానికి కారణాలు చెప్తే సరిపోదని నాకు పనికావాలన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ దసరా నాటికి పూర్తి చేసి వాడుకలోకి తీసుకు రావాలని మున్సిపల్‌కమిషనర్‌ను ఆదేశించారు. 

Updated Date - 2020-08-04T23:37:21+05:30 IST