ఇంటిపన్ను వడ్డీతో చెల్లించాల్సిందే : పేర్ని

ABN , First Publish Date - 2020-05-24T08:00:38+05:30 IST

లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లలో ఉండి విద్యుత్‌ ఎక్కువ వాడటం వల్లే బిల్లులు అధికంగా వచ్చాయని మంత్రి పేర్ని నాని అన్నారు.

ఇంటిపన్ను వడ్డీతో చెల్లించాల్సిందే : పేర్ని

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లలో ఉండి విద్యుత్‌ ఎక్కువ వాడటం వల్లే బిల్లులు అధికంగా వచ్చాయని మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నం ఆశీర్వాదపురంలో శనివారం పర్యటించారు. దాసరి చినకోటమ్మ అనే మహిళ తనకు ఇంటిపన్ను, కుళాయిపన్ను అధికంగా వచ్చాయని మంత్రి దృష్టికి తీసుకు వచ్చింది. రసీదులను మంత్రి పరిశీలించారు. ఇంటిపన్ను రూ.400 మాత్రమే వచ్చిందని, పాతబకాయి రూ.715 చెల్లించాల్సి ఉందన్నారు.  ఇంటి పన్ను, నీటి పన్ను ఆలస్యంగా చెల్లిస్తే  రెండు రూపాయల వడ్డీతో కలిపి కట్టాల్సి ఉందన్నారు. విద్యుత్‌ బిల్లును పరిశీలించిన మంత్రి  విద్యుత్‌ వాడకం కూడా అధికంగానే ఉందన్నారు. 

Updated Date - 2020-05-24T08:00:38+05:30 IST