అమరావతి: రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన జిల్లా కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలన్నారు. గతంలో కొన్ని ప్రాంతాలకు జిల్లా కేంద్రాలు ఎంతెంత దూరం ఉండేవో ఆయన గుర్తు చేశారు. రంపచోడవరానికి కాకినాడకు మధ్య ఎంత దూరం ఉండేదో గమనించాలన్నారు. ఒక కులసంఘానికి ప్రాతినిథ్యం వహించే నాయకుడు రాగద్వేషాలు లేకుండా ఉండాలన్నారు. హరిరమ జోగయ్య ఓ రాజకీయ నాయకుడని ఆయన పేర్కొన్నారు. పీఆర్సీపై ఉద్యోగులు చర్చలకు రావాలన్నారు. చర్చలకు వస్తేనే ఈ సమస్యకు పరిష్కరం లభిస్తుందన్నారు. చర్చలకు వచ్చి ఆర్థికశాఖ చెప్పింది తప్పని నిరూపిస్తే సీఎం జగన్‌కు చెప్పి తాము ఒప్పించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి