మరో ఇరవై ఏళ్లు మాదే అధికారం

ABN , First Publish Date - 2022-05-18T16:10:43+05:30 IST

రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్లు డీఎంకే అధికారంలో ఉంటుందని సహకార శాఖ మంత్రి ఐ.పెరియస్వామి పేర్కొపారు. తేని జిల్లా అల్లినగరంలో డీఎంకే ఏడాది పాలన ప్రజలకు వివరించేలా

మరో ఇరవై ఏళ్లు మాదే అధికారం

                             - సహకార శాఖ మంత్రి పెరియస్వామి


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్లు డీఎంకే అధికారంలో ఉంటుందని సహకార శాఖ మంత్రి ఐ.పెరియస్వామి పేర్కొపారు. తేని జిల్లా అల్లినగరంలో డీఎంకే ఏడాది పాలన ప్రజలకు వివరించేలా ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి పెరియస్వామి మాట్లాడుతూ, కరోనా నియంత్రణలో గత అన్నాడీఎంకే ప్రభుత్వం విషలమైందన్నారు. ఆ ప్రభుత్వం కొనసాగి ఉంటే రాష్ట్రంలో కరోనా మరణాలు భారీగా పెరిగేవన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్‌ కరోనా నియంత్రణ చర్యలు వేగవంతం చేయడంతో ప్రస్తుతం ప్రజా జీవనం సాధారణ స్థితికి వచ్చిందన్నారు. రానున్న రెండేళ్లలో కేంద్రంలో అధికారం మారబోతోందని, ప్రస్తుతం గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు విస్తరిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారని, ఇటీవల సంభవించిన లాకప్‌ డెత్‌ వ్యవహారంలో పోలీసులపైనే కేసు నమోదుకు సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-05-18T16:10:43+05:30 IST