జగనన్న పచ్చతోరణం పథకంపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

ABN , First Publish Date - 2021-06-12T18:47:01+05:30 IST

జగనన్న పచ్చతోరణం పథకంపై జిల్లా అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

జగనన్న పచ్చతోరణం పథకంపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

తిరుపతి: జగనన్న పచ్చతోరణం పథకంపై జిల్లా అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి   సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. గ్రామాలను పచ్చదనంగా మారుస్తున్నామని... గ్రామాల్లో చెట్లను పెంచే బాధ్యతను సర్పంచులకు అప్పచెబుతున్నామని తెలిపారు. సర్పంచులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జగనన్న పచ్చతోరణంతో రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేస్తామన్నారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షించే బాధ్యత సర్పంచులకు అప్పచెపుతామని చెప్పారు.  మూడు నెలల తర్వాత చిత్తూరు జిల్లాలో జగనన్న పచ్చతోరణం అమలు తీరును రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు వివరిస్తామన్నారు.


మామిడి ధరలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందిస్తూ...‘‘నేను రైతును..రైతు కష్టాలు నాకు తెలుసు. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నరేగా పనులపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే 5 లక్షల లోపు పెండింగ్లో ఉన్న  నరేగా బిల్లులు చెల్లించాం. మిగిలిన పనులకు విజిలెన్స్ నివేదిక రాగానే చెల్లిస్తాం. చంద్రబాబు  చేసే ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-06-12T18:47:01+05:30 IST