Abn logo
Jul 25 2021 @ 14:35PM

చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు

చిత్తూరు: ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షం తీరుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలమనేరుకు హంద్రీనీవా నీళ్లు త్వరలో తీసుకొస్తామని, పలమనేరులో పాలిటెక్నిక్ కాలేజ్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.