విదేశాల నుంచి చిత్తూరుకు 1956 మంది వచ్చారు: పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2020-03-26T19:10:25+05:30 IST

విదేశాల నుంచి చిత్తూరు జిల్లాకు 1956 మందిని గుర్తించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు...

విదేశాల నుంచి చిత్తూరుకు 1956 మంది వచ్చారు: పెద్దిరెడ్డి

తిరుపతి : విదేశాల నుంచి చిత్తూరు జిల్లాకు 1956 మందిని గుర్తించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు మీడియా తిరుపతిలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ఇంకా 101 మందిని వివరాలు ఇప్పటికీ వెలుగులోకి రాలేదన్నారు. రాయలసీమ ప్రాంత వాసుల కోసం పద్మావతి డిగ్రీ కాలేజిలో 750 పడకలు, 100 ఐసోలేటెడ్ బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. యూకే నుంచి వచ్చిన శ్రీకాళహస్తి వాసికి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. అయితే.. మిగతావి నెగటివ్‌గా వచ్చాయని పెద్దిరెడ్డి తెలిపారు. పద్మావతి నిలయంలో 12 మందిని ఉంచామని.. ప్రజల్లో కరోనాపై అవగాహన తీసుకు రావలసిన అవసరం ఉందన్నారు. 


దరుసుగా ప్రవర్తిస్తే...!

మా నాయకులందరిని కోరుతున్నా జిల్లాలో  పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలి. 40 వేల మాస్కులు మహిళా సంఘాల ద్వారా తయారీ చేస్తున్నాం. జిల్లాలో వెంటలైటర్స్ తక్కువగా ఉన్నాయి. లయన్స్ తరపున వెంటలైటర్స్ ఏర్పాటు చేస్తాం. ఆదివారం ఆరోగ్య శాఖా మంత్రి చిత్తూరు జిల్లాకు రానున్నారు. జిల్లాల్లో ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే, దురుసుగా ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వాలంటీర్లకు, సెక్రటరీలకి రెండు మూడు రోజుల్లో ఐడెంటిటీ కార్డులు అందచేస్తాం. రేపు విజయవాడ రివ్యూ మీటింగ్ అనంతరం ఐడెంటిటీ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్టాల,జిల్లాల నుంచి వచ్చిన వారిని తప్పకుండా గుర్తించి వారికి అన్ని పరీక్షలు నిర్వహిస్తాం అని పెద్దిరెడ్డి తెలిపారు.

Updated Date - 2020-03-26T19:10:25+05:30 IST