Abn logo
Apr 13 2021 @ 00:18AM

మాజీ ఎమ్మెల్యేకు మంత్రి నివాళి

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 12: హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మృతిపట్ల రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకర్‌నారాయణ నివాళులర్పించారు. సోమవారం మంత్రి సేవామందిరానికి  చేరుకుని తిప్పేస్వామి సమాధివద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు సేవలందించారని ఆయన కురుబ కులస్థులకు పెద్దదిక్కుగా నిలిచారన్నారు. అనంతరం కాంగ్రె్‌సపార్టీ ఇనచార్జ్‌ కేటీ శ్రీధర్‌ను కలిసి పరామర్శించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. అదే విధంగా అనంతపురం అర్బన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తిప్పేస్వామి చిత్ర పటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రివెంట హిందూపురం వైసీపీ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, పరిగి మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement