మచిలీపట్నం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మాతృ వియోగంతో బాధపడుతున్న రాష్ట్ర మంత్రి పేర్ని నానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం పరామర్శించారు. నాని తల్లి నాగేశ్వరమ్మ(82) ఈనెల 19న మరణించిన విషయం విదితమే. మచిలీపట్నంలోని మంత్రి నాని గృహానికి వెళ్లిన జగన్ నాగేశ్వరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్చించారు.