రాసలీలల మంత్రి రాజీనామా

ABN , First Publish Date - 2021-03-04T07:03:36+05:30 IST

రాసలీలల సీడీల వివాదంలో చిక్కుకొన్న కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్‌ జార్కిహోళి తన పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగం ఆశ చూపించి మంత్రి ఓ యువతితో శృంగారంలో పాల్గొన్నట్టు చూపే వీడియో ఒకటి

రాసలీలల మంత్రి రాజీనామా

తొలుత ససేమిరా అన్న రమేశ్‌

బీజేపీ పట్టుబట్టడంతో తప్పని పరిస్థితి

రాజీనామాను ఆమోదించిన కర్ణాటక సీఎం


బెంగళూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాసలీలల సీడీల వివాదంలో చిక్కుకొన్న కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్‌ జార్కిహోళి తన పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగం ఆశ చూపించి మంత్రి ఓ యువతితో శృంగారంలో పాల్గొన్నట్టు చూపే వీడియో ఒకటి మంగళవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ వీడియో తొలుత పలు చానళ్లలో, అనంతరం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మంత్రి ఆ రాత్రంతా రహస్యంగా గడిపారు. న్యాయనిపుణులు, పార్టీ పెద్దలతో ఆయన చర్చలు జరిపారు. సీఎం యడియూరప్పతోనూ సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ను పార్టీ జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్‌ సంతోశ్‌ బుధవారం ఢిల్లీకి పిలిపించుకొన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఓ వైపు శాసనసభ సమావేశాలు మరోవైపు ఉప ఎన్నికలు ఉండటంతో వెంటనే రాజీనామా చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు మంత్రి పదవికి రమేశ్‌ జార్కిహొళి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు.


బుధవారం మధ్యాహ్నం తన తమ్ముడు, కర్ణాటక మిల్క్‌ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌) చైర్మన్‌ బాలచంద్ర జార్కిహోళి ద్వారా రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి సమర్పించారు. ఆ తర్వాత కాసేపటికే ఆ లేఖను అంగీకరించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించి, గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపారు. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ఉండటంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ  ఈ అంశాన్ని ప్రధాన అస్త్రం చేసుకొని భారీ వ్యూహానికి సిద్ధం కాగా, ముందుగానే మంత్రితో రాజీనామా చేయించి బీజేపీ కొంత నష్టనివారణ చేసుకోంది. కాగా తమ కుటుంబంపై కక్ష గట్టిన ప్రతిపక్ష పార్టీ అగ్రనేత ఒకరు ఈ కుట్రకు కారణమని బాలచంద్ర జార్కిహొళీ ఆరోపించారు. ఈ ఉదంతంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. 


మంగళవారం సీడీ బహిరంగం కావడంతో మంత్రి రాత్రంతా రహస్యంగా గడిపారు. ఓ వైపు న్యాయనిపుణులు, పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. సీఎం యడియూరప్పతోను సుదీర్ఘంగా చర్చించారు. మరో ప్రత్యామ్నాయం లేక మంత్రి రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ను పార్టీ జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్‌ సంతోశ్‌ బుధవారం ఢిల్లీకి పిలిపించుకొన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఓ వైపు శాసనసభ సమావేశాలు మరోవైపు ఉప ఎన్నికలు ఉండటంతో వెంటనే రాజీనామా చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. వారి ఆదేశాల మేరకే మంత్రి పదవికి రమేశ్‌ జార్కిహొళి రాజీనామా చేశారు. తన తమ్ముడు, కర్ణాటక మిల్క్‌ఫెడరేషన్‌(కేఎంఎఫ్‌) చైర్మన్‌ బాలచంద్ర జార్కిహోళి ద్వారా రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి సమర్పించారు. ఆ తర్వాత కాసేపటికే ఆ లేఖను అంగీకరించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించి, గవర్నర్‌ ఆమోదానికి పంపారు. 


గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ఉండటంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ భారీ వ్యూహానికి సిద్ధం కాగా, ముందుగానే మంత్రితో రాజీనామా చేయించి బీజేపీ కొంత నష్టనివారణ చేసుకోంది. కాగా తమ కుటుంబంపై కక్ష గట్టిన ప్రతిపక్ష పార్టీ అగ్రనేత ఒకరు ఈ కుట్రకు కారణమని బాలచంద్ర జార్కిహొళీ ఆరోపించారు. ఈ ఉదంతంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. కాగా మంత్రితో రాసలీల సీడీలో ఉన్న బాధితురాలు షార్ట్‌ఫిలిమ్‌ తీసేందుకు ఓ డ్యాం వద్ద అనుమతులు కావాలని కోరినట్లు సంభాషణలో ఉంది. అయితే, ఇంతవరకు బాధిత మహిళ నేరుగా ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. కాగా, రమేశ్‌ జార్కిహోళి ప్రాతినిథ్యం వహించే బెళగావి జిల్లా గోకాక్‌లో ఆయన అభిమానులు వీరంగం చేశారు. రమేశ్‌ రాజీనామా విషయం తెలిసిన వెంటనే గోకాక్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-03-04T07:03:36+05:30 IST